కార్డన్ సర్చ్... 50 బైకులు స్వాధీనం
NEWS Jul 20,2025 08:09 am
జన్నారం మండలం పొన్కల్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీ నగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 బైకులు, 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జన్నారం ఎస్ఐ అనూష, దండేపల్లి ఎస్ఐ తైసీనుద్దీన్ పాల్గొన్నారు.