ఆదిలాబాద్ పట్టణంలోని BJP కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశనిర్దేశం చేశారు.