ఇక ఆ పాత పేర్లు ఉండవు
NEWS Jul 20,2025 12:29 am
తెలంగాణలోని శ్రీశైలం పరిసరాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈగలపెంట, దోమలపెంట గ్రామాలకు ఇక ఆ పేర్లు ఉండవు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం దోమలపెంటను బ్రహ్మగిరిగా, ఈగలపెంటను కృష్ణగిరిగా మారుస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడించారు. పూర్వం బ్రహ్మగిరి, కృష్ణగిరి పేర్లే ఉండేవని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అవి మారాయని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులను మార్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి.