కొండేపిలోని టంగుటూరు రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంకు సిబ్బంది దాడికి దిగారు గుర్తు తెలియని యువకులు. పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా పెట్రోల్ బంక్ బాయ్స్ పై పిడి గుద్దులు గుద్ది విచక్షణా రహితంగా దాడి చేశారు. బంకులో పని చేసే శేషుకు గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. దాడి జరిగిన ఘటనను పోలీసులు సీసీటీవీ పుటేజ్‌లో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పెట్రోల్ బంక్ యజమాని ఎస్ఐ ప్రేమ్ కుమార్ కు కంప్లైంట్ చేశారు.