మొక్కలను నాటిన ఎంపీ నగేష్
NEWS Jul 19,2025 04:09 pm
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలను MP నగేశ్, MLA పాయల్ శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.