మాజీ మంత్రి విడదల రజినికి నోటీసులు
NEWS Jul 19,2025 05:44 pm
ఏపీలో నోటీసుల పర్వం కొనసాగుతోంది. వరుసగా వైసీపీ సీనియర్ నేతలకు నోటీసులు అందుతున్నాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి విడదల రజినికి సత్తెనపల్లి పోలీసుల నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమించి జన సమీకరణ చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ నెల 20న ఆదివారం విచారణకు రావాలని రజినికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.