ఈనెల 28న ఇచ్చోడ మండల కేంద్రంలోని రాయల్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇచ్చోడ మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా కు 60కి పైగా ప్రముఖ కంపెనీలు రానున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత హాజరు కావాలని కోరారు. వివరాలకు 8106987405 సంప్రదించాలన్నారు.