అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు
NEWS Jul 19,2025 02:24 pm
టీటీడీ ఈవో శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నలుగురు ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమాపతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలలో డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ జి. అసుంతలను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు ఈవో.