శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
NEWS Jul 19,2025 06:32 am
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. జూరాల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తివేశారు. దీంతో, శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది.శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులుగా ఉంది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటిమట్టం 196.561గా ఉంది. వరద ప్రవాహం పెరిగితే ప్రాజెక్టు గేట్లను మళ్లీ ఎత్తే అవకాశం ఉంది.