కావాలని కేసులు బనాయించారు
NEWS Jul 19,2025 11:20 am
ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని కక్ష కట్టారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కానీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారు మొదట ఒక వ్యక్తిని జైలులో పెట్టాలని నిర్ణయించుకుంటారు, ఆపై దాని చుట్టూ కథను తిప్పుతారంటూ ఎంపీ ఆరోపించారు. మద్యం గురించి కాదు, వైసీపీ నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. 2014-19లో కూడా ఆనాడు కేసులు నమోదు చేశారని, నిరూపించలేక పోయారని అన్నారు.