రేవంత్ మాటలపై కోమటిరెడ్డి సీరియస్
NEWS Jul 19,2025 05:56 am
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించు కోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.