AP లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఈనెల 21న సిట్ కార్యాలయంలో 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురిని విచారించింది.