విద్యుత్ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ
NEWS Jul 19,2025 08:35 am
ప్రపంచంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకునేందుకు విద్యుత్ శాఖ సిబ్బందికి ఆర్టిజన్ నుండి సిఎండి వరకు శిక్షణ ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలోని అన్ని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టులలోని యూనిట్లను వినియోగంలోకి తీసుకు వస్తామన్నారు. కాలుష్య రహిత, తక్కువ ధరలో అందుబాటులో ఉండే గ్రీన్ పవర్ ఉత్పత్తిపై దృష్టి సారించామన్నారు. 2029-30 నాటికి 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటు, సౌర విద్యుత్ నిల్వ కోసం టెండర్లు పిలుస్తామన్నారు.