శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు
NEWS Jul 19,2025 07:09 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారిని 73 వేల 93 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 570 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 24 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.