సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
NEWS Jul 18,2025 11:29 pm
హాస్యనటుడు, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ (53) అనారోగ్యంతో కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 'ఖుషి' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఫిష్ వెంకట్ భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, సోషల్ మీడియా వేదికలపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.