కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. నూతనంగా నియమితురాలైన ఆమెను టీపీసీసీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల రమేష్ శుక్రవారం ఉట్నూర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.