సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2034 వరకు తానే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. కేసీఆర్ నీ గుండెలపై రాసుకో అంటూ సవాల్ విసిరారు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని అన్నారు. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తానే ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తానని అన్నారు సీఎం.