నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ కాలనీలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు విద్యార్థుల చేతులకు గోరింటాకు పెట్టారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆటల పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని అన్నారు.. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.