మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను పిచ్చోడు అయ్యి రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరగక ముందే ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చూపించాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. ఒక కిట్టి పార్టీ ఆంటీ లాగా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. ఎక్కడో ఎవరో చెప్పింది విని దానికి పది మందిని పోగేసుకొని చిట్ చాట్ పేరిట చిల్లర మాటలు మాట్లాడటం ఏంటి అంటూ ప్రశ్నించారు.