శ్రీశైలంలో స్పర్శ దర్శనం రద్దు
NEWS Jul 18,2025 12:11 pm
శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల జులై 25 నుండి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మొత్తం 16 రోజులు గర్భాలయ, సామూహిక అభిషేకాలను ఆలయ అధికారులు నిలిపి వేశారు. ఆగస్టు 15 నుండి 18 వరకు స్పర్శ దర్శనం నిలుపుదల చేసి, అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. శ్రావణ శని, ఆది, సోమ, పర్వదినాల్లోనూ అభిషేకాలు నిలుపుదల చేశామన్నారు.