బాసర అమ్మ వారిని దర్శించుకున్న శ్రీధర్ బాబు
NEWS Jul 18,2025 11:55 am
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తోందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు...