HCAపై కేసు నమోదు చేసిన ED
NEWS Jul 18,2025 10:54 am
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీ ఏ) లో మనీ లాండరింగ్ వ్యవహారంపై అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు, రాజేంద్రయాదవ్, సునీల్ కాంటే, కవితలపై PMLA సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. BCCI నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరా తీస్తోంది. సీఐడీ కస్టడీ ముగియగానే ఈడీ రంగంలోకి దిగనుంది.