సారంగాపూర్ మండల విద్యాధికారి మృతి
NEWS Jul 18,2025 09:31 am
సారంగాపూర్ మండల విద్యాధికారి మధుసూదన్ మృతి చెందారు. ఆయన స్వగ్రామం వేంగ్వ పేట కాగా ప్రస్తుతం నిర్మల్ లోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉపాధ్యాయులుగా, ఎంఈఓ గా ఎన్నో సేవలు అందించారని, ఆయన మరణం పట్ల డీఈఓ రామారావు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.