కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పులి వెంకటరెడ్డి పార్క్ గేటు వద్ద శుక్రవారం కురిసిన వర్షం కారణంగా సైడు కాలువలు పొంగిపొర్లాయి. దీంతో కాలవలోని మురుగునీరు వర్షపునీరు కలసి పార్కు గేటు ఎదురుగా నిలిచి పోయింది. గేట్ ఎదురుగా మురుగు నీరు నిలవడంతో పార్కులోకి వెళ్లే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుంది. కొన్ని రోజులపాటు మురుగు నీరు గేటుకు అడ్డంగా ఉంటుంది.