శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు
NEWS Jul 18,2025 08:32 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీవారిని 63 వేల 897 మంది దర్శించుకున్నారు. 29 వేల 500 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.