జగన్ కామెంట్స్ యనమల సీరియస్
NEWS Jul 18,2025 08:29 am
మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నాడని, పూర్తిగా నేరపూరిత రాజకీయాలకు తెర లేపాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీని నామ రూపాలు లేకుండా చేశారని, కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా తనకు బుద్ది రాలేదన్నారు. వ్యవస్థలను సర్వ నాశనం చేసింది చాలక కూటమి సర్కార్ పై నిందారోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.