కల్తీ పేరిట కల్లును నిషేధించే కుట్రను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరనేని నర్సాగౌడ్ పేర్కొన్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి మరణించిన నిరుపేద ప్రజలకు మోకు దెబ్బ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ సంతాపం ప్రకటిస్తుందని తెలిపారు..బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా సహాయ పడతామన్నారు. కల్లు పై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.