ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు
NEWS Jul 18,2025 02:46 am
ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ మున్సిపాల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ ఆదేశాల మేరకు పట్టణంలోని దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్న యాజమాన్లకు రూ. 4600 జరిమానా విధించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని లేకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.