హైదరాబాద్ లో కుండపోత వర్షం
NEWS Jul 17,2025 09:32 pm
భారీ వర్షం కురియడంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ - ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద భారీ వర్షానికి రహదారులు నీట మునిగాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ నగర్, దిల్ షుఖ్ నగర్, హిమాయత్ నగర్, చాంద్రాయణ్ గుట్ట, రాజేంద్ర నగర్, చందానగర్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట, కోకా పేట, మియాపూర్ , కూకట్ పల్లి , తదితర ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.