రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NEWS Jul 17,2025 09:36 pm
నిర్మల్ జిల్లా ధని గ్రామం నుండి రాజేశ్వర్ తండా వరకు 1 కోటి 60 లక్షలు రూపాయల నిధులతో R&B, BT రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య ఉందని మహిళలు తెలుపగా తక్షణమే నిధులు మంజూరు చేయించి మూడు రోజుల్లోగా నీటి సమస్యను పరిష్కరిస్తాం అని తెలిపారు. గ్రామాబివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.