కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి లో చేరిక
NEWS Jul 17,2025 09:37 pm
నిర్మల్ జిల్లా మామడ మండలం కోరిటికల్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాజీ ఎంపీటీసీ దేవుల గంగన్న, మాజీ సర్పంచ్ మెరుగు రాజేశ్వర్, మాజీ వార్డు సభ్యులు ముత్తన్న, లింగన్న, ముత్యం, స్వామి, తో పాటు పలువురు కార్యకర్తలు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాపు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.