నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే వాటిని పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.