తాను బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో నీటి సమస్యలపై కీలక చర్చలు జరిగాయని అన్నారు.నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబిస్తామని చెప్పారు. ప్రధాని కూడా నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్నారని తెలిపారు. బనకచర్లపై ముందుకే వెళతామన్నారు.