కేటీఆర్, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు
NEWS Jul 17,2025 03:46 pm
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కేటీఆర్, కవితపై సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హాకి ఫిర్యాదు చేసింది. HCAలో జరిగిన అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావు రావడం, గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. తను గెలవగానే తన విజయం కేటీఆర్, కవిత, హరీశ్ రావులకు అంకితం ఇస్తున్నట్లు జగన్ మోహన్ రావు చెప్పారని గుర్తు చేశారు. వీరితో పాటు మరికొందరిపై కూడా నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరింది.