జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
NEWS Feb 20,2026 02:54 pm
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ కు మీడియా ద్వారా కోరారు. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నాడని రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ తోనే కలిసి నడిచారన్నారు.