యూట్యూబర్ అన్వేష్‌కు షాక్ తగిలింది. అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా సంస్థకి లేఖ రాశారు.