ఆలయాల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్
NEWS Jul 17,2025 03:13 pm
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ది కోసం ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా కనిగిరి నియోజకవర్గం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 మంది అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరంగా అనేక మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. ప్రధానంగా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధూప దీప నైవేద్యాలకు నిధులు ఇస్తున్నామన్నారు.