బనకచర్ల ప్రాజెక్టు బాబుకు ఏటీఎం
NEWS Jul 17,2025 03:08 pm
సీఎం చంద్రబాబుకు బనకచర్ల ప్రాజెక్టుకు ఏటీఎం లాగా మారి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పోలవరం ను చంపి బనకచర్ల కట్టాలని చూస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు . తక్షణమే బనకచర్ల ప్రయత్నాలు బంద్ పెట్టాలని, పోలవరం కట్టాలని, జలయజ్ఞం ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించిన పాపం జగన్ రెడ్డిదేనంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు బీద ఏడుపులు ఏడవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క కాంట్రాక్టర్ కు తప్ప ఏపీకి ఎలాంటి లాభం ఉండదన్నారు.