రైతులకు నష్టపరిహారం అందజేత
NEWS Jul 17,2025 05:53 pm
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు గురువారం కార్యాలయంలో ఆర్డీవో రామచందర్ నాయక్ నష్టపరిహారం చెక్కులను అందించారు. మక్తల్ మండలం మంథన్ గోడు గ్రామానికి చెందిన 27 మంది రైతులకు కోటి 22 లక్షల రూపాయల చెక్కులను అందించారు. భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేసేందుకు రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని ఆర్డీవో కోరారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.