వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
NEWS Jul 17,2025 12:32 pm
అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు పక్కన పెట్టింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన దావాను అనుమతించింది. రాష్ట్ర సర్కార్ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది ధర్మాసనం.