చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
NEWS Jul 17,2025 12:02 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో 900 కంటే ఎక్కువ ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా రన్‌మెషీన్ నిలిచాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేయడంతో కోహ్లీ టీ20 రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. అతనికి టెస్టుల్లో 937, వన్డేల్లో 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.