శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు
NEWS Jul 17,2025 10:12 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 104 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 896 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.