శ్రీవారి అన్న ప్రసాదంపై భక్తులు సంతృప్తి
NEWS Jul 17,2025 09:00 am
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పరిసరాలను పరిశీలించారు. భక్తులకు వడ్డిస్తున్న అన్న ప్రసాదం, కూరగాయాలను తనిఖీ చేశారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదంలో అందిస్తున్న అన్నం చాలా మృదువుగా, వంటకాలు రుచికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. ప్రత్యేకంగా రాత్రి భోజనంలో వడను వడ్డించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.