తెలంగాణను తాకట్టు పెట్టింది మీరు కాదా..?
NEWS Jul 17,2025 08:26 am
గోదావరి, కృష్టా జలాలపై ఢిల్లీలో చర్చలు జరిగితే మీకేందుకు జలి జ్వరం వస్తోంది కేటీఆర్, హరీష్ రావు అంటూ నిలదీశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ ను రంగరించలేక కుమిలి పోతున్నారా అంటూ ప్రశ్నించారు. మీలాగా రాయలసీమకు వెళ్లి చేపలు పులుసు తిని గోదావరి జలాలు రాసిస్తామని అనుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి కృష్ణా జలాలను తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లు మేం చేస్తామని అనుకుంటే ఎలా అని ఫైర్ అయ్యారు.