కీలక నేతలపై వైసీపీ వేటు
NEWS Jul 17,2025 08:22 am
వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమ శిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంది హైకమాండ్ . వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ప్రకటించారు నవీన్ నిశ్చల్. ఆయన చేసిన కామెంట్స్ పై జగన్ సీరియస్ అయ్యారు.