బనకచర్ల పై కమిటీ ఏర్పాటుకు సీఎంలు ఓకే
NEWS Jul 17,2025 08:17 am
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కమిటీ వేసేందుకు ఒప్పుకున్నారంటూ తెలిపారు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టు అనుమతికి సంబంధించి చర్చలు జరిగాయని నిమ్మల చెబితే కానీ అలాంటి చర్చకు రానే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.