బనకచర్లపై ప్రజలను మోసం చేస్తున్న సీఎం
NEWS Jul 17,2025 07:53 am
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. సోయి లేకుండా అబద్దాలు ఆడుతున్నాడని ఆరోపించారు. అసలు ఎజెండాలో లేనే లేదని, చర్చలు జరపలేదని అబద్దం చెప్పాడని అన్నారు. బనకచర్ల చర్చకు వచ్చిందని, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల చెప్పారని మరి ఇప్పుడు ఏమంటారంటూ ప్రశ్నించారు.