గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు
NEWS Jul 17,2025 07:49 am
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు అని, ఎవడబ్బ సొమ్ము కాదన్నారు. గోదావరి నీళ్లు ఒక్క ఇంచు కదలనివ్వం, ఒక్క చుక్క తీసుకు పోనివ్వం అనే పట్టుదల మన రైతులకు రావాలన్నారు. నీళ్లను దొంగతనం చేస్తున్న చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపడం ఎందుకని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టు గురించి సరైన అవగాహన లేని నీవు చర్చించి ఏం చేస్తావంటూ నిప్పులు చెరిగారు.