కనిగిరి పట్టణంలోని తీగల గొంది లో గల అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న ఆహార పదార్థాలను రుచి చూసి పరిశీలించారు. సిబ్బంది పనితీరును గమనించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు వారి పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని అన్నా క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు.