పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి
NEWS Jul 17,2025 05:53 am
ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి బండారి మధు వర్షకొండ MPPS పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి తమ బాధ్యతగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.